Hyderabad Road Accident : మాదాపూర్‌లో కారు ఢీ, యువతి మృతి.. ఎంపీ లింగమనేని కుమారుడిపై కేసు నమోదు!

Hyderabad Road Accident : హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందింది. ఈ కేసులో ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Hyderabad Road Accident

  • ఎంపీ లింగమనేని కుమారుడిపై కేసు
  • ఈనెల 16న కారుతో యువతిని ఢీకొట్టిన సంజూష్‌
  • ఇనార్బిట్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..
  • రోడ్డు దాటుతుండగా కారు ఢీ, యువతి మృతి

Hyderabad Road Accident : మాదాపూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతుండగా 26 ఏళ్ల యువతిని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ యువతి మృతి చెందింది.

ఈ ప్రమాదానికి కారణమైన ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్‌పై కేసు నమోదైంది. ప్రమాదానికి కారణమైన కారును (Hyderabad Road Accident) సంజూష్ నడిపినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. దాంతో ఆయన్ను నిందితుడిగా చేర్చి మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం..

Read Also : Former OSD Sumanth : మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై హత్యాయత్నం కేసు!

ఈ నెల 16న మధ్యాహ్నం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనార్బిట్ మాల్‌ వద్ద యువతి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు ఆమెను ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో యువతి తీవ్రంగా గాయపడింది. రక్తస్రావంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అసలు ప్రమాదం సమయంలో కారు ఎవరూ నడుపుతున్నారనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టగా కారు సంజూష్ నడిపినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయనపై (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనం వేగం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.