ఏపీలో 19 మంది ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IAS and IPS officers transfers in Andhra Pradesh

AP IAS and IPS officers: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఆర్థిక శాఖ నుంచి గిరిజా శంకర్ ను రిలీవ్ చేశారు. వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్‌ను బదిలీ చేశారు. గ్రామ సచివాలయాల విభాగం కార్యదర్శిగా సురేష్ కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇద్దరు ఐపీఎస్ అధికారులను కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది.

ఐఏఎస్ అధికారుల బదిలీ వివరాలు..
స్త్రీ శిశు సంక్షేమ కార్యదర్శి: సూర్య కుమారి
పరిశ్రమల శాఖ డైరెక్టర్: సి. శ్రీధర్
ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి: జె నివాస్
సూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్: విజయరామరాజు
ఐ అండ్ పీఆర్ డైరెక్టర్: హిమాంషు శుక్లా
వ్యవసాయ శాఖ డైరెక్టర్: డిల్లీరావు
అటవీ శాఖ స్పెషల్ సీఎస్: అనంత రాము
రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్: రాంప్రకాష్ సిసోడియా
భూపరిపాలన చీఫ్ కమిషనర్: జయలక్ష్మి
రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ: కాంతీలాల్ దండే

మౌళిక వసతులు పెట్టుబడుల శాఖ కార్యదర్శి: సురేష్ కుమార్
సేల్స్ ట్యాక్స్ బాధ్యతలు: పియూష్ కుమార్
ఐటీ అండ్ సీ, ఆర్టిజిఎస్ సెక్రెటరీ: సౌరభ్ కౌర్
మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి: హర్షవర్దన్
బీసీ సంక్షేమ కార్యదర్శి: పోలా భాస్కర్
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి: కన్నబాబు
టూరిజం కార్యదర్శి: వినయ్ చంద్
యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శి: వివేక్ యాదవ్

ఐపీఎస్ అధికారుల బదిలీ వివరాలు..
విజిలెన్స్ డిజీ: హరీష్ కుమార్ గుప్త
హోం శాఖ ముఖ్య కార్యదర్శి: కుమార్ విశ్వజిత్

Also Read : ఏపీలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోయింది? ఏయే విధానాల వల్ల ఇసుక దుమారం చెలరేగింది?

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ నియామకం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్ఛార్జి వైస్ ఛాన్స్‌ల‌ర్‌గా డిఎంఇ డాక్టర్ నరసింహం నియమితులయ్యారు. రెగ్యులర్ వీసీని ప్రభుత్వం నియమించే వరకూ ఆయన పదవీలో కొనసాగనున్నారు.