×
Ad

Kinjarapu Atchannaidu : మరోసారి జగన్ ను గెలిపిస్తే తెలంగాణకు వలస వెళ్లాల్సిందే : అచ్చెన్నాయుడు

జగన్ ముత్తాతలు అనంతపురంలో అడుక్కున్నారని.. జగన్ తాత కడపకు వెళ్లి రౌడీయిజం చేసి కోట్లల్లో ఆస్తి సంపాదించాడని పేర్కొన్నారు. 2019లో జగన్ ను గెలిపించటం ప్రజల తప్పేనని తెలిపారు.

  • Published On : June 16, 2023 / 08:11 AM IST

Achchennaidu (1)

Atchannaidu Criticism Jagan : సీఎం జగన్ పై టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ ను గెలిపిస్తే తెలంగాణకు వలస వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో కరెంట్ బిల్లు రేట్లు పెరిగాయో? వైసీపీ హయాంలో పేరిగాయో? చర్చకు సిద్ధమా అంటూ జగన్ కి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. తాను నిరూపిస్తానని.. నిరూపించలేకపౌతే రాజకీయాలకు సన్యాసం తీసుకుంటానని తేల్చి చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు సభలో అచ్చెన్నాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయంటే సొంత ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నప్ చేశారని ఆరోపించారు. అదే తాను ముఖ్యమంత్రి అయతే రాజీనామ చేశావాడినని తెలిపారు. జగన్ అవినీతి పరుడని, పంచ భూతాలను దోచుకున్నాడని విమర్శించారు.

Uttar Pradesh : తాళి కట్టే సమయంలో అదనపు కట్నం డిమాండ్.. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబీకులు

జగన్ ముత్తాతలు అనంతపురంలో అడుక్కున్నారని.. జగన్ తాత కడపకు వెళ్లి రౌడీయిజం చేసి కోట్లల్లో ఆస్తి సంపాదించాడని పేర్కొన్నారు. 2019లో జగన్ ను గెలిపించటం ప్రజల తప్పేనని తెలిపారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ లక్ష కోట్ల రూపాయల అవినీతి చేశాడని ఆరోపించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని వెల్లడించారు. అలాంటి వ్యక్తిని 2019లో ప్రజలు ఎలా గెలిపించారని అడిగారు.