Massive Heart Attack : కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్-ఇంచార్జ్ తహసిల్దార్ గుండెపోటుతో మృతి
ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా ఓ ప్రభుత్వ ఉద్యోగి హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు విడిచాడు.
- chvmurthy
- Published On : October 23, 2021 / 11:05 AM IST
massive heart attack on duty
Massive Heart Attack : ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా ఓ ప్రభుత్వ ఉద్యోగి హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు విడిచాడు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల ఇన్ చార్జి తహశీల్ధార్ పి.కనకరాజు(50) శుక్రవారం ఉదయం తన ఆఫీసు నుంచి జిల్లా కలెక్టర్ M.రవికిరణ్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు.
ఆసమయంలో కనకరాజుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగానే కూర్చున్న చోటే ఆయన కుప్పకూలిపోయారు. పరిస్థితి గమనించిన కార్యాలయ సిబ్బంది ఆయన్ను వెంటనే తుని ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ఆయన్ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు తెలిపారు. దీంతో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
