Lunar Eclipse: చంద్రగ్రహణం.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం మూసివేత
గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత దర్శనాలు పునఃప్రారంభిస్తారు. ఈ మేరకు దేవస్థానం ఈవో శ్రీనా నాయక్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
- Naveen
- Published On : February 28, 2026 / 07:36 PM IST
Indrakeeladri Temple
Lunar Eclipse: చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రి దేవస్థానం ఈవో శ్రీనా నాయక్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం చంద్రగ్రహణం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం మూసివేస్తామన్నారు. కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు దేవస్థానం తెలిపింది. మార్చి 3న ప్రధాన ఆలయం సహా ఉపాలయాలు మూసివేయనున్నారు. మార్చి 4న బుధవారం ఉదయం 8 గంటలకు తిరిగి సర్వదర్శనం ప్రారంభిస్తామన్నారు. గ్రహణానంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత దర్శనాలు పునఃప్రారంభిస్తారు. ఈ మేరకు దేవస్థానం ఈవో శ్రీనా నాయక్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
