×
Ad

AP Assembly : చేతికి కట్టుతో ఒకరు.. కర్ర సాయంతో మరొకరు.. అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ.. నేతల మధ్య ఆసక్తికర సంభాషణ ..

AP Assembly : చేతికి కట్టుతో ఎమ్మెల్సీ శ్రీకాంత్, కాలుకు దెబ్బ తగిలి కర్ర సాయంతో ఎమ్మెల్యే పార్థసారథి గురువారం అసెంబ్లీ ఆవరణకు వచ్చారు. దీంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య ఆసక్థికర సంభాషణ జరిగింది.

AP Assembly

  • ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య క్రీడా పోటీలు
  • గాయపడిన ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఎమ్మెల్యే పార్థసారథి
  • చేతికి కట్టుతో, కర్ర సాయంతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
  • అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంభాషణ

AP Assembly : అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చేతికి కట్టుతో ఎమ్మెల్సీ శ్రీకాంత్, కాలుకు దెబ్బ తగిలి కర్ర సాయంతో ఎమ్మెల్యే పార్థసారథి గురువారం ఒకే సమయంలో కారులో అసెంబ్లీ ఆవరణకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న ఎమ్మెల్యే బొండా ఉమా .. వారిని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు.

క్రీడల్లో దెబ్బతగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వికలాంగుల కోటాలో ఫించన్ ఇవ్వమని సీఎం చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపాదన పెడదామని బోండా ఉమాసరదా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. చట్టసభ సభ్యులు కాబట్టి అవసరమైతే అత్యవసర బిల్లు పెట్టిద్దాం అంటూ చమత్కారం చేశాడు. దీంతో తోటి సభ్యులు స్పందిస్తూ.. నిజంగా అలాంటి బిల్లు పెడితే సగం మందికి పథకం వర్తించేలా ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. ఆటవిడుపు కోసం ఆటలాడమంటే ప్రతీ ఒక్కరూ కుర్రాళ్లులా ఫీలయి ఇలా దెబ్బలు తగిలించుకుంటున్నాం అంటూ శ్రీకాంత్ బదులిచ్చారు.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ క్రీడల్లో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రొఫెషనల్ గా ఆడుతూ ప్రతిభ చాటారు. ఈ క్రమంలో పలువురు గాయాలపాలయ్యారు. బుధవారం క్రికెట్ ఆడిన ఉప సభాప్రతి రఘురామకృష్ణరాజు రనౌట్ నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడడంతో అతని చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే ఫిజియో వైద్యుడు పరీక్షించి పట్టీ వేశారు. అదేవిధంగా ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం రాత్రి నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్సీ కుంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యే పార్థసారథికి గాయాలయ్యాయి.

తమ జట్టుపై కూతుకు వచ్చిన ఎమ్మెల్యే పార్థసారథిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పట్టుకునే ప్రయత్నంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వారిపై పడ్డారు. ఈ క్రమంలో పార్థసారథి పాదం భాగంలో గాయమైంది. శ్రీకాంత్‌కు భుజం వద్ద కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యాయి. వీరి గాయాలను బుధవారం పరీక్షలో గుర్తించారు. అయితే, గురువారం ఉదయం అసెంబ్లీకి ఎమ్మెల్సీ శ్రీకాంత్ చేతికి కట్టుతో, పార్థసారథి కాలుకు దెబ్బతగిలి కర్ర సాయంతో వచ్చారు. వీరిద్దరూ ఒకేసారి వేరువేరు వాహనాల్లో అసెంబ్లీ రావడం.. అక్కడే ఎమ్మెల్యే బోండా ఉండటంతో వీరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

Also Read : TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్.. తిరుమలలో నకిలీ దందా.. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన