Temple IP Notice : అమ్మవారి ఆలయానికే ఐపీ నోటీసులు.. అనంతపురంలో సంచలన ఘటన

Chowdeswari Devi Temple IP Notice : అప్పులు తీర్చలేక ఐపీకి వెళ్లడం చూశాం.. కానీ ఏకంగా అమ్మవారికే ఐపీ నోటీసులు పంపడం ఎప్పుడైనా విన్నారా? అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.

IP Notice Chowdeswari Devi Temple

Chowdeswari Devi Temple IP Notice : అప్పులు తీర్చలేక ఐపీకి వెళ్లడం చూశాం.. కానీ ఏకంగా అమ్మవారికే ఐపీ నోటీసులు పంపడం ఎప్పుడైనా విన్నారా? అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అప్పుల జాబితాలో మనుషుల పేర్లతో పాటు ఏకంగా చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయం పేరు కూడా చేరిపోయింది. రూ.1.80కోట్ల అప్పుల నుంచి బయటపడేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నంలో.. అమ్మవారి ఆలయానికి సైతం ఐపీ నోటీసులు పంపించాడు. దీంతో భక్తులు అమ్మవారికి నోటీసులా బాబోయ్! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Also Read : Tamil Politics : తమిళ రాజకీయాల్లోకి హీరో శివకార్తికేయన్..! హాట్ టాపిక్‌గా ఫ్యాన్స్ మీట్ ..

అనంతపురం జిల్లా యాడికి మండలంకు చెందిన మోహన్ ఇంటి వద్ద చిట్టీలు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో అధిక వడ్డీలు ఇస్తానని ఆశ చూపడంతో చాలా మంది అతడికి పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చారు. గడువు దాటినా ఆ మొత్తాలను చెల్లించకపోవడంతో బాధితులు పలుమార్లు అతడి ఇంటి వద్దకు వెళ్లి ఒత్తిడి చేశారు.

మోహన్ కు సుమారు రూ.1.80 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. మోహన్ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులకు రూ.7లక్షలకుపైగా అప్పులు చెల్లించాల్సి ఉంది. అప్పుల నుంచి బయటపడేందుకు అతను ఐపీ ప్రక్రియను ఆశ్రయించాడు. తనకు అప్పులిచ్చిన వారితోపాటు అమ్మవారి ఆలయానికి కోర్టు ద్వారా ఐపీ పెడుతూ నోటీసులు పంపించాడు.

అమ్మవారి ఆలయం పేరుతో ఏకంగా రూ.7 లక్షలకు ఐపీ నోటీసు జారీ అయినట్లు సమాచారం. ఈ నోటీసు ఆలయానికి చేరడంతో ఆలయ కమిటీ సభ్యులు అవాక్కయ్యారు. అమ్మవారి పేరుతో ఐటీ నోటీసులు పంపడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు ఇచ్చిన వ్యక్తులకు నోటీసులు ఇవ్వాల్సింది పోయి.. ఏకంగా అమ్మవారి ఆలయానికే ఐపీ నోటీసులు ఎలా పంపుతారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ కమిటీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.