జగన్ తప్పకుండా సీఎం అవుతారు : మోహన్ బాబు

జగన్ తప్పకుండా సీఎం అవుతారని...రాష్ట్రానికి మంచి జరుగుతుందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.

  • Publish Date - March 26, 2019 / 11:49 AM IST

జగన్ తప్పకుండా సీఎం అవుతారని…రాష్ట్రానికి మంచి జరుగుతుందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.

హైదరాబాద్ : సినీ నటుడు మోహన్ బాబు వైసీపీలో చేరారు. జగన్ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ జగన్ తప్పకుండా సీఎం అవుతారని తెలిపారు. ఆయన సీఎం అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ అధోగతి పాలైందని విమర్శించారు.

చంద్రబాబును అగౌరవపర్చాలని తనకు లేదన్నారు. చంద్రబాబును ఫీజు రీయింబర్స్ మెంట్ గురించి ఎన్నోసార్లు అడిగానని..మూడు మాసాలకు ఒకసారి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామన్నారని గుర్తుచేశారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు నుంచి సమాధానం లేదన్నారు. తమ విద్యా సంస్థలకు రూ.19 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ రావాలన్నారు. చంద్రబాబు చేసిన వాగ్ధానాలనే నెరవేర్చమని అడుగుతున్నానని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి బకాయిలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఏపీ ప్రజలపై దాడులు చేయలేదని తేల్చి చెప్పారు. తాను రౌడీయిజం చేసి ఆస్తులు సంపాదించలేదన్నారు.