Jagapathi Babu Sister : గుంటూరు మేయర్‌గా సినీ నటుడు జగపతిబాబు చెల్లెలు ఘన విజయం.. మెజార్టీ ఎంతంటే?

Jagapathi Babu Sister Kovelamudi Lakshmi Aparna Guntur Mayor : ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు సోదరి, టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గుంటూరు మేయర్‌గా విజయం సాధించారు.

Jagapathi Babu Younger Sister wins as Guntur Mayor

Jagapathi Babu Sister Kovelamudi Lakshmi Aparna Guntur Mayor : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు సోదరి, టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గుంటూరు మేయర్‌గా విజయం సాధించారు. ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగానే ఆమె భారీ మెజార్టీతో విజయం సాధించారు. 96,294 ఓట్ల మెజార్టీతో ఆమె విజయకేతనం ఎగురవేశారు. లక్ష్మీ అపర్ణకు 2,08,925 ఓట్లు పోలవ్వగా.. తాడికొండ శ్రీదేవి (వైసీపీ)కి 1,12,631 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి 4,805 ఓట్లు పడగా.. నోటాకు 2,783, చెల్లనివి 8,555గా నమోదయ్యాయి.

Also Read : AP Municipal Election Winners: ఏపీలో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. మేయర్లుగా గెలిచింది వీరే, పార్టీ, మెజార్టీ.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

కోవెలమూడి లక్ష్మీ అపర్ణ విజయం కోసం ఎన్నికల ముందు జగపతి బాబు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన చెల్లి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ టీడీపీ అభ్యర్థిగా గుంటూరు మేయర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగపతిబాబు వీడియోలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకోసం కూటమి అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటుతో మద్దతు తెలపాలని కోరారు. గతంలో కూటమిపై నమ్మకంతో భారీ విజయాన్ని అందించిన ప్రజలు, అదే ఆదరణతో ఈసారి కూడా లక్ష్మీ అపర్ణను, అలాగే కూటమి తరఫున కార్పొరేటర్లుగా పోటీచేసే అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ జగపతిబాబు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే.. గుంటూరు కార్పొరేషన్ లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. గుంటూరు కార్పొరేషన్‌లో మొత్తం 76 డివిజన్‌లు ఉండగా.. కూటమి అభ్యర్థులు 64 డివిజన్లలో విజయం సాధించారు. వీరిలో టీడీపీ 48 స్థానాల్లో, జనసేన 13 స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక వైసీపీ అభ్యర్థులు 11 డివిజన్లలో విజయం సాధించారు.

లక్ష్మీ అపర్ణ విజయంలో ఆసక్తికర విషయం ఉంది. ఆమె భర్త రవీంద్ర పది నెలలపాటు మేయర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు అదే మేయర్ కుర్చీలో ఆమె కూర్చోబోతున్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో భార్యాభర్తలిద్దరూ వరుసగా నగర ప్రథమ పౌరులుగా ఒకే కుర్చీని అదిరోహించడం విశేషం.