MLA Arava Sridhar Resignation : పవన్ కళ్యాణ్ వార్నింగ్.. వెంటనే MLA అరవ శ్రీధర్ రాజీనామా
MLA Arava Sridhar Resignation : ఏపీ రాజకీయాల్లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అవర శ్రీధర్ రాజీనామా చేశారు.
- Dharani Pilli
- Updated on- May 23, 2026 / 03:29 PM IST
janasena mla arava sridhar resigns from government whip post after meeting pawan kalyan
- ఏపీ రాజకీయాల్లో సంచలనం
- జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా
- పవన్ తో భేటీ అనంతరం నిర్ణయం
MLA Arava Sridhar Resignation : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అరవ శ్రీధర్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన తన రాజీనామా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అందించారు. శనివారం నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నేడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన పలు ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తన వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పవన్‌కు తెలిపారు.
తాజాగా శనివారం నాడు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే బాలరాజులను మంగళగిరి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వీరిద్దరికీ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. గత కొంత కాలంగా ఈ ఇద్దరిపైనా వస్తోన్న వ్యక్తిగత ఆరోపణలపై ఆరా తీసిన పవన్ కల్యాణ్ వారి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యే బాలరాజుకి.. తన వ్యక్తిగత వివాదాలను సరిదిద్దుకునేందుకు 4 వారాల సమయం ఇచ్చారు. ఇలాంటి అంశాలు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకూడదని పవన్ కల్యాణ్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
*తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా.. కారణం ఇదే..
ఇదలా ఉంటే పవన్ కల్యాణ్ తో భేటీ అనంతరం అరవ శ్రీధర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో విప్‌గా కొనసాగుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఈ రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు స్వయంగా అందజేసినట్లు సమాచారం. అనంతరం అరవ శ్రీధర్ మాట్లాడుతూ.. తన రాజీనామాపై స్పందిస్తూ వ్యక్తిగత కారణాలతో విప్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఇటీవల నెలకొన్న వివాదాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది.
