Pawan Kalyan : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు జనసేనాని దీక్ష

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉక్కు పోరాటానికి సిద్ధమయ్యారు. విశాఖలోని ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జనసేనాని ఒకరోజు దీక్ష చేయనున్నారు

Pawan Kalyan (2)

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉక్కు పోరాటానికి సిద్ధమయ్యారు. విశాఖలోని ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జనసేనాని ఒకరోజు దీక్ష చేయనున్నారు. ఈ దీక్ష మంగళగిరి జనసేన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. దీనికోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. దీక్షలో జనసేనానితోపాటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అలాగే ఇతర సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జనసేన నేతలు పాల్గొననున్నారు.

చదవండి : Pawan Kalyan Deeksha : పవన్ కళ్యాణ్ ఒకరోజు దీక్ష

పవన్ దీక్షకు భారీగా జనసైనికులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. ఈ ఒక్కరోజు దీక్షతో తన నిరసన తెలియచేయాలని జనసేన భావిస్తుంది. అయితే పవన్ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు.. మరి దీక్షలో పవన్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా? మరోసారి జగన్ సర్కార్ పై విరుచుకుపడతారా అన్న ఆసక్తి నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు పూనుకున్న నాటినుంచే పవన్ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ కార్మికులకు మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆదివారం దీక్ష చేయనున్నారు.

చదవండి : Pawan Kalyan : పవన్‌కళ్యాణ్ కోసం.. జాక్వెలిన్ అవుట్.. నర్గిస్ ఇన్..

ఇక ఇదిలా ఉంటే కేంద్రం తీసుకున్న ప్రైవేటీ కరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉక్కు పరిశ్రమ కార్మికులు గత 300 రోజులుగా పోరాడుతున్నారు. వీరిపోరాటానికి పలు పార్టీలతోపాటు, కార్మిక సంఘాల నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. కార్మికులతో కలిసి పోరాటం చేస్తున్నారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.