Jnaneshwari Missing Case : కనిపించని చ్నినారి జ్ఞానేశ్వరి జాడ.. పెంపుడు కుక్క మృతి.. ఎస్పీకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..

Jnaneshwari Missing Case : చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. కేసు పురోగతిపై కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. చిన్నారి ఆచూకీని త్వరితగతిన కొనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలనుసైతం వినియోగించుకోవాలని సూచించాచారు.

Jnaneshwari missing case updates pawankalyan Key instructions to police officers

  • ఇంకా కనిపించని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ
  • కుక్క మృతితో కీలక ఆధారం కోల్పోయిన పోలీసులు
  • జ్ఞానేశ్వరి ఆచూకీపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి
  • ఎన్డీఆర్ఎఫ్ సేవలు వినియోగించాలని సూచన

Jnaneshwari Missing Case : కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. రోజులు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ లభించకపోవటం కుటుంబ సభ్యుల్లో ఆందోళనను పెంచుతోంది. ఇదే సమయంలో అధికారులకు ఈ కేసు పెద్ద సవాల్ గా మారింది. చిన్నారి ఆచూకీని గుర్తించేందుకు పోలీస్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది.

Also Read : Mega High-Speed Rail Plan : రైలు ఎక్కితే చాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు 2 గంటలు.. చెన్నై 2.5 గంటలు.. రైల్వేల మెగా ప్లాన్!

చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు అదృశ్యమై తిరిగొచ్చిన పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి విశ్లేషించారు. చిన్నారి ఆచూకీని కనుగొనడంలో ఆ కక్కు సహాయ పడుతుందని పోలీసులు భావించారు. అయితే, కుక్క మృతి చెందడంతో కీలక ఆధారం కోల్పోయినట్లయిందని అధికారులు చెబుతున్నారు. ఆ కుక్క తిరిగిన అన్ని ప్రదేశాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. రహదారిపై కార్లు వెళ్తుంటే అరుస్తూ వెంబడించిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో చిన్నారి అపహరణకు గురై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో ప్రధానంగా విచారణ కొనసాగిస్తున్నారు. జ్ఞానేశ్వరి అదృశ్యానికి ముందు తోటలో ఎవరైనా అనుమాస్పదంగా సంచరించారా లేదా రెక్కీ నిర్వహించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థల పరిసర ప్రాంతాల్లో సంచరించిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్న పోలీసులు, ఆ ప్రాంతానికి సంబంధించిన ఏడు మొబైల్ ఫోన్ నెంబర్ల కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. మరోవైపు భారీ పైథాన్ పాములు లేదా ఇతర అడవి జంతువుల దాడి జరిగి ఉండొచ్చనే కోణాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చడం లేదు. మెటల్, డిటెక్టర్లు, ప్రత్యేక సాంకేతిక పరికరాలతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. చిన్నాకి ఆచూకీ కోసం ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. కేసు పురోగతిపై కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. చిన్నారి ఆచూకీని త్వరితగతిన కొనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. గాలింపు చర్యల్లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలనుసైతం వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. దట్టమైన అడవుల్లోకి సైతం వెళ్లగలిగే అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, నిపుణుల సాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టాలని పవన్‌ తెలిపారు.