Mega High-Speed Rail Plan : రైలు ఎక్కితే చాలు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు 2 గంటలు.. చెన్నై 2.5 గంటలు.. రైల్వేల మెగా ప్లాన్!
Mega High-Speed Rail Plan : మెగా హైస్పీడ్ రైల్ ప్లానింగ్ రెడీ అవుతోంది. ఈ నెట్ వర్క్ అమల్లోకి వస్తే ఇకపై లాంగ్ జర్నీ గంటల కొద్ది చేయాల్సిన పని ఉండదు. హైదరాబాద్ నుంచి కేవలం రెండు గంటల్లోనే బెంగళూరు, చెన్నైకి వెళ్లొచ్చు.
Mega High-Speed Rail Plan ( Image Credit : AI )
- దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి భారీ ప్లానింగ్
- హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం రెండు గంటలే..
- విమానాలకు వెళ్లే బదులు రైళ్లలోనే వేగంగా గమ్యం చేరుకోవచ్చు
Mega High-Speed Rail Plan : రైలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారా? మీకో గుడ్ న్యూస్.. ఇకపై లాంగ్ జర్నీలు చేసినా కూడా కొద్ది గంటల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు. అదే మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం రెండు గంటల్లోనే చేరుకోవచ్చు.
అలాగే, చెన్నైకి రెండున్నర గంటల టైమ్, ఢిల్లీ, ముంబై నగరాలకు కూడా ఇంకా తక్కువ సమయం పట్టనుందా? అవుననే చెప్పాలి. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా హై-స్పీడ్ రైలు (Mega High-Speed Rail Plan) కారిడార్ల నిర్మాణానికి భారతీయ రైల్వేలు భారీ ప్లానింగ్ రెడీ చేస్తున్నాయి.
ప్రస్తుతం గంటల తరబడి సాగే లాంగ్ జర్నీలు కూడా కొన్ని గంటలకే చేరుకోవచ్చు అనమాట. రూ.16 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ మెగా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ రైల్వే బిగ్ ప్లాన్ అమలైతే మాత్రం దూరపు రైలు ప్రయాణ స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. అంతేకాదు.. అనేక మార్గాల్లో విమాన ప్రయాణానికి కూడా ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. ఇక అందరూ విమానాల్లో వెళ్లే బదులు రైళ్లలోనే సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
న్యూఢిల్లీ నుంచి సిలిగురికి జస్ట్ 6 గంటలే :
ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి సిలిగురికి సూపర్ ఫాస్ట్ రైళ్లు నడుస్తున్నా ప్రయాణానికి 20 గంటలకు పైనే టైమ్ పడుతోంది. అయితే, ప్రతిపాదిత ఢిల్లీ–వారణాసి, వారణాసి–సిలిగురి హై-స్పీడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తే.. ఇదే జర్నీ కేవలం 6 గంటలే టైమ్ పడుతుంది. లక్నో, వారణాసి, పాట్నా వంటి ప్రధాన నగరాలు ఈ మార్గంలోనే ఇంటర్ లింక్ కానున్నాయి.
హైదరాబాద్‌కు ఎంత సమయమంటే? :
ఇకపై దక్షిణ భారత్‌లోనూ రైల్వే సర్వీసులలో కూడా భారీ మార్పులు రానున్నాయి. ప్రతిపాదిత హై-స్పీడ్ కారిడార్ల ప్రకారం.. ప్రస్తుతం 8 గంటలకుపైగా పట్టే రైల్వే ప్రయాణం కేవలం 1.6 గంటలకు తగ్గనుంది.
అదేవిధంగా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే రైళ్లు 8 గంటలకు బదులుగా కేవలం 2 గంటలు, చెన్నై నుంచి హైదరాబాద్‌కు 12 గంటల ప్రయాణం కాస్త 2.5 గంటలకే పరిమితం కానుంది. దీంతో మూడు ప్రధాన మెట్రో నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.
దేశవ్యాప్తంగా రైల్వే హై-స్పీడ్ కనెక్టివిటీ :
ముంబై నుంచి పూణే, పూణే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి వారణాసి, వారణాసి నుంచి సిలిగురి వంటి కారిడార్లు దేశంలోని దక్షిణ, తూర్పు, ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను సింగిల్ హై-స్పీడ్ నెట్‌వర్క్‌తో లింక్ కానున్నాయి.
స్వదేశీ బుల్లెట్ రైలు కూడా రెడీ :
భారత్ ఫస్ట్ స్వదేశీ బుల్లెట్ రైలును భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) డెవలప్ చేస్తోంది. ముందుగా ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో 2027 నాటికి మొదటి ప్రయోగాత్మక సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అదే జరిగితే గంటకు 280 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకెళ్లనున్నాయి. భారత రైల్వే చరిత్రలోనే కొత్త అధ్యాయానికి ఈ రైళ్లు నాంది పలికేనట్టే..
