KA Paul : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా నా ఫాన్స్ అయిపోండి .. నా దగ్గర రోడ్ మ్యాప్ ఉంది : కేఏ పాల్

మా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. నాతో వచ్చి పోరాటం చెయ్యి..విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడుతున్నా..నా పోరాటంలో నువ్వు కూడా భాగస్వామయ్యం చేయి అంటూ పిలుపునిచ్చారు కేఏ పాల్.

KA Paul : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై రేపు వాదనలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంత వరకు అయినా వెళ్లానని నా ప్రాణాల్ని పణంగా పెడతానని..4వేల కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ కోసం నెల రోజుల్లో డొనేషన్ ఇస్తానని స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంటే ఆ అప్పులన్నీ తీర్చేస్తా అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ పనిలో పనిగా జనసేనాని పవన్ కల్యాణ్ పైనా..అతని ఫ్యాన్స్ గురించి వ్యాఖ్యలు చేశారు.

మా తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నారంటూ పాల్ పవన్ పై సెటైర్లు వేశారు. నువ్వ ఎలాగూ గెలవలేవు నాతో వచ్చి పోరాటం చెయ్యి..విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడుతున్నా..నా పోరాటంలో నువ్వు కూడా భాగస్వామయ్యం చేయి అంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ,గద్దర్ నాతో కలిసి వచ్చారని వారిలాగా నువ్వు కూడా నాతో చేయి కలుపు అంటూ సూచించారు. విశాఖ ఉక్కు కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం…రా తమ్ముడు అంటూ పిలుపునిచ్చారు.

కాపులు ఇప్పటి వరకు సీఎం అవ్వలేదని..రాష్ట్రంలో ప్రజా శాంతి పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతూన్నానని పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీకి విరాళాలు ఇవ్వండి అని ప్రజలకు ఈ సందర్భంగా పాల్ పిలుపునిచ్చారు. ఛారిటీ డబ్బులు రాజకీయాల కోసం వాడకూడదు కాబట్టే నేను వినియోగించడం లేదని కాబట్టి ప్రజాశాంతి పార్టీకి ప్రజలంతా విరాళాలు ఇవ్వాలని కోరారు.

Vizag steel plant : విశాఖ ఉక్కు కోసం ఎంతవరకు అయినా వెళతా .. నా ప్రాణాలు పణంగా పెడతా : KA Paul

తెలుగు రాష్ట్రాలకు మంచి రోజులు వస్తున్నాయి నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని నిరుద్యోగులకు సూచించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని..మా తమ్ముడు పవన్ కళ్యాణ్ బిజెపి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నారని కానీ మా దగ్గర ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఉంది నాతో వచ్చెసెయ్..ప్రజాశాంతి పార్టీతో కలిసి పోటీ చేయమని సూచించారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నా ఫాన్స్ అయిపోండి అంటూ పనిలో పనిగా పవన్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు కేఏ పాల్.







                                    

ట్రెండింగ్ వార్తలు