Vizag steel plant : విశాఖ ఉక్కు కోసం ఎంతవరకు అయినా వెళతా .. నా ప్రాణాలు పణంగా పెడతా : KA Paul

నేను కోర్టులో న్యాయ పోరాటం చేసిన అన్ని కేసుల్లో విజయం సాధించానని స్టీల్ ప్లాంట్ పిటీషన్ పై కూడా విజయం సాధిస్తానని కేఏ పాల్ ధీమా వ్యక్తంచేశారు. 3లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ 3 వేల కొట్లుకు అమ్మాలని చూస్తున్నారని..58 మంది మిలినియర్ ఫ్రెండ్స్ తో ప్రవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని తెలిపారు.

Vizag steel plant : విశాఖ ఉక్కు కోసం ఎంతవరకు అయినా వెళతా .. నా ప్రాణాలు పణంగా పెడతా : KA Paul

KA Paul

Vizag steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది ధర్మాసనం. దీనిపై రేపు విచారిస్తామని వెల్లడించింది. దీంతో ఈ పిటీషన్ పై వాదనలు రేపు అంటే ఏప్రిల్ 27(2023)న జరుగనున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణకు వ్యతిరేకంగా పిటీషన్ వేసిన సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతు..విశాఖ ఉక్కు కోసం నేను ఎందాకైన వెళతానని తన ప్రాణాలు అయినా పణంగా పెడతానని అన్నారు. విశాఖ ఉక్కు ప్రవేటికరణకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశానని తెలిపిన పాల్ గతంలో వేసిన పిల్ కు ఈ పిల్ కు సంబంధం లేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా పరిగణలోకి తీసుకోవాలని నేను కోర్టు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఎంప్లాయిస్ షేర్ హోల్డర్స్ కాకూడదని యజమనులు భాగస్వాములు కావాలని అన్నారు. నేను కోర్టులో న్యాయ పోరాటం చేసిన అన్ని కేసుల్లో విజయం సాధించానని స్టీల్ ప్లాంట్ పిటీషన్ పై కూడా విజయం సాధిస్తానని పాల్ ధీమా వ్యక్తంచేశారు. 3లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ 3 వేల కొట్లుకు అమ్మాలని చూస్తున్నారని..

58 మంది మిలినియర్ ఫ్రెండ్స్ తో ప్రవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని తెలిపారు. ఇస్టానుసారంగా గంగవరం పోర్టును కూడా అమ్మేశారని ఆరోపించిన పాల్ ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వలేదని..ఏపీలో ఉన్న ఆస్తులను ప్రవేట్ పరం చేశారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ కాకుండా ప్రాణ త్యాగం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు పాల్.4వేల కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ కోసం నెల రోజుల్లో డొనేషన్ ఇస్తానని స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉంటే ఆ అప్పులన్నీ తీర్చేస్తానని అన్నారు.నేను 5లక్షల కోట్లను తెచ్చా మీరు ఎందుకు స్టీల్ ప్లాంట్ కోసం ఇవ్వలేకపొతున్నారు? అని ప్రశ్నించారు. నా ఫండ్స్ రాకుండా  ప్రభుత్వాలు నిలిపివేస్తున్నాయని ఆరోపించారు పాల్.

ఈ సందర్భంగా పాక్ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు స్టీల్ ప్లాంట్ కొంటామని బిడ్ వేస్తామని సీఎం కేసీఆర్ పొలిటికల్ డ్రామా ఆడారు అంటూ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ విషయం కేసీఆర్ పొలిటికల్ స్టంట్ చేసిన వినోదం చూశారు అంటూ ఎద్దేవా చేశారు. నేను 5లక్షల కోట్లు తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో సేవ కార్యక్రమాలు చేశానని ఈ సందర్భంగా పాల్ చెప్పుకొచ్చారు.