జగన్ పై నిందలు వేస్తే ఊరుకోను : పవన్ కు కేఏ పాల్ వార్నింగ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. సీఎం జగన్ పై నిందలు వేయొద్దని పవన్ కు హితవు పలికారు. కాపులు,

  • Publish Date - January 17, 2020 / 09:46 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. సీఎం జగన్ పై నిందలు వేయొద్దని పవన్ కు హితవు పలికారు. కాపులు,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. సీఎం జగన్ పై నిందలు వేయొద్దని పవన్ కు హితవు పలికారు. కాపులు, దళితులు, బలహీనవర్గాల ప్రజలను పవన్ మోసం చేస్తున్నారని పాల్ ఆరోపించారు. బీజేపీతో పవన్ కలవడం విడ్డూరం అన్నారు. పవన్ డ్యాన్సులు, డ్రామాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. ప్రతిపక్షాలన్నీ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కేఏ పాల్ సూచించారు.

కేఏ పాల్ కామెంట్స్ : 
* పవన్ కళ్యాణ్ కూడా పవర్ కోసమే పార్టీ పెట్టారని నేను చెప్పాను
* జనసేనకు 5-6 శాతం ఓట్ల కంటే ఎక్కువ రావని ముందే చెప్పా
* పోటీ చేసిన చోట పవన్ ఓడిపోతాడని చెప్పాను
* పవన్ తమ్ముడు నీకు అంత పవర్ హంగ్రీ ఉండటం మంచిది కాదు
* ప్రధాని మోడీతో అంత క్లోజ్ కనెక్షన్ ఉంటే..స్పెషల్ స్టేటస్ తెచ్చి చూపించు
* నీ పనులేవో, నీ డ్యాన్సులు ఏవో నువ్వు చేసుకో

* కాపులు, దళితులు, గిరిజనులు, బడుగులు, రైతులు, నిరుద్యోగులను ఎందుకు తప్పుదారి పట్టిస్తావు
* ప్రజలు నిన్ను కోరుకోలేదు
* ఎన్నికలకు మూడు వారాల ముందు నేను వచ్చా
* 2008 నుంచి మీ అన్నయ్య పార్టీ నుంచి నువ్వు యాక్టివ్ గా ఉన్నావు
* ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
* జగన్ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు

* జగన్ ముఖ్యమంత్రి.. మనమంతా ఆయనకు సపోర్ట్ చేయాలి
* స్పెషల్ స్టేటస్ తీసుకుని వస్తే ప్రజలు అభినందిస్తారు
* నిన్నటి వరకు చంద్రబాబుతో ఉండి ఆయన పలుకులు పలికావు
* ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలవడమా..?

రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో పొత్తు:

బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రజలు తృతీయ ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని… వారి ఆశల మేరకే తమ పొత్తు ఏర్పడిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎలాంటి షరతులు లేకుండా ఇరు పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. 2024లో అధికారం మాదే అని బీజేపీ-జనసేన నేతలు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి నడుస్తామని పవన్ తెలిపారు.

Also Read : Google Pay యూజర్లా: ఇలా మెసేజ్ వచ్చిందా.. అకౌంట్ ఖాళీ!

ట్రెండింగ్ వార్తలు