×
Ad

Kakinada Blast: ఒక్కొక్కరికి 20 లక్షలు.. కాకినాడ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం

బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు చంద్రబాబు.

  • Published On : February 28, 2026 / 11:09 PM IST

Cm Chandrababu Representative Image (Image Credit To Original Source)

 

Kakinada Blast: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి 21 మంది మృతి చెందడం పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు చంద్రబాబు. ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అనౌన్స్ చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు చంద్రబాబు.

వేట్లపాలెం ఘటన బాధాకరం, దురదృష్టకరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పేలుడు ఘటనలో 21 మంది చనిపోయారని తెలిపారు. 9 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పేలుడు ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు చంద్రబాబు. ఈ ఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. విచారణ పూర్తయ్యాక అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు.

బాణసంచా తయారీ కేంద్రంలో నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు అన్నారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. బాధ్యుల ఆస్తులను జప్తు చేస్తామన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. బాధిత కుటుంబాల్లోని పిల్లలను ప్రభుత్వమే చదివిస్తుందన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు కేటాయిస్తామన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.