Kondapalli Srinivas: రాజకీయాల్లో విమర్శలు కామన్. కానీ ఆ విమర్శలను తట్టుకుని నిలబడటమే అసలైన సవాల్. అలా ఎన్నో సవాళ్లను, ప్రతికూలతను దాటి..తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారట మంత్రి కొండపల్లి శ్రీనివాస్. మొదట్లో కాస్త తడబాటు పడినట్లు కనిపించినా దిద్దుబాటు చర్యలతో దూకుడు పెంచి ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారట ఆ యంగ్ లీడర్.
ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన పనితీరే సమాధానంగా నిలదొక్కుకునేందుకు చెమటోడుస్తున్నారట కొండపల్లి. 2024 ఎన్నిలకు మూడు నెలల ముందు వరకు ఆయనెవరో జిల్లా ప్రజలకు పెద్దగా తెలియనే తెలియదు. కానీ అందరి ఊహలను తారుమారు చేస్తూ..చివరి నిమిషంలో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి..అనూహ్యంగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని, అఖండ విజయం సాధించారు.
అంతటితో ఆయన అదృష్టం ఆగిపోలేదు. సీనియర్లు అసూయ పడేలా..ఏకంగా మంత్రివర్గంలో బెర్తు దక్కించుకున్నారు కొండపల్లి శ్రీనివాసరావు. తడబడిన అడుగులతో మొదలైన కొండపల్లి పొలిటికల్ కెరీర్..కట్ చేస్తే ఎప్పుడూ స్టేట్ లెవల్‌లో రీసౌండ్ చేస్తోందట.
Also Read: మున్సిపల్ ఎన్నికల వేళ పొత్తుల రాజకీయం.. చివరకు ఎటువైపు?
కొండపల్లి శ్రీనివాసరావుది విజయనగరం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం. ఆయన తాత కొండపల్లి పైడితల్లి నాయుడు రెండుసార్లు ఎంపీగా పనిచేయగా, చిన్నాన్న కొండపల్లి అప్పలనాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక ఆయన తండ్రి కొండపల్లి కొండలరావు కూడా ఎంపీపీగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది.
2024 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో..
ఇంతటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన శ్రీనివాసరావు.. 2024 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉండేవారు. తండ్రి అడుగుజాడల్లో ఉంటూ, రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న దశలో అనూహ్యంగా ఆయనకు టీడీపీ నుంచి పిలుపురావడం, ఎన్నికలకు మూడు నెలల ముందు టీడీపీ గూటికి చేరడం చకచకా జరిగిపోయాయి. ఈ దశలో ఆయనకు తన చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టికెట్టు కోసం రెండు కుటుంబాల మధ్య పొలిటికల్ ఫైట్ నడిచింది.
కానీ గజపతినగరం టికెట్ కొండపల్లికే దక్కింది..గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు కూడా. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్‌గా శభాష్ అనిపించుకునేలా దూకుడు పెంచారట. తండ్రి చాటు బిడ్డడు, అనుభవం లేదని..సీనియర్ల ముందు నిలబడలేడు అంటూ ప్రత్యర్థులే కాదు..సొంత వర్గాల నుంచే వ్యాఖ్యలు వినిపించేవట. కానీ తనను తాను అప్డేట్ చేసుకుని ఓ పవర్ ఫుల్ లీడర్‌గా ప్రొజెక్ట్ అవుతున్నారట. పనితోనే ప్రత్యర్థులకు జవాబు ఇచ్చేలా ఆయన వ్యవహరశైలి మారిపోయిందంటున్నారు.
తగ్గేదేలే అన్నట్లు అడుగులు
శాఖాపరమైన, పాలనా వ్యవహారాల్లోనే కాదు.. రాజకీయంగానూ కొండపల్లి దూకుడు పెంచారట. మొదట్లో రాజకీయ విమర్శలకు, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు కాస్త వెనకాముందు ఆలోచించిన ఆయన, ఇప్పుడు మాత్రం పవర్ పాలిటిక్స్ చేస్తూ, తగ్గేదేలే అనేలా ఘాటైన కౌంటర్లతో ప్రతిపక్షాలపై అటాక్‌కు దిగుతున్నారట.
కూటమి ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకుపడే మాజీమంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు, విజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను వంటి నేతల పంచ్‌లకు పవర్ ఫుల్ పంచ్‌లతో బదులిస్తున్నారట కొండపల్లి. వ్యూహాల్లోనూ, గ్రౌండ్ లెవెల్ పనితీరులోనూ తగ్గేదేలే అన్నట్లు కొండపల్లి వేస్తున్న అడుగులు, విమర్శకుల నోళ్లకు తాళం పడేలా చేస్తున్నాయట.
అంతేకాదు, తన సొంత నియోజకవర్గం గజపతినగరంలో పట్టు పెంచుకోవడంతో పాటు క్యాడర్‌తో నేరుగా టచ్‌లో ఉంటూ, సమస్యలపై క్విక్‌గా రియాక్ట్ అవుతూ వస్తున్నారట. జిల్లా అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెడుతూ, తన పనితీరును ఇంకా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇలా ఇంటా బయటా అందిరితో శభాష్ అనిపించుకునేలా పనితీరుకు పదునుపెడుతున్న కొండపల్లి దూకుడుపై..క్యాడర్‌లో ఫుల్ జోష్ పెరిగిందన్న చర్చ జరుగుతోంది.