Kottu Satyanarayana: పవన్ కల్యాణ్ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే: ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ

పవన్ కి పిచ్చి ఎక్కిందా? అని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.

Kottu Satyanarayana

Kottu Satyanarayana – Pawan Kalyan: వాలంటీర్ల పరిస్థితి బూమ్ బూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ విస్కీకి ఎక్కువ అంటూ, మంచి విస్కీ అందిస్తానంటూ వాలంటీర్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవమానించారని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. మహిళలను అవమానించడం ఆయన జీవితంలో చేసిన పెద్ద తప్పని చెప్పారు.

పశ్చిమగోదావరి ( West Godavari) జిల్లా, తాడేపల్లిగూడెం పడల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొట్టు సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడారు. వాలంటరీ వ్యవస్థపై పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని చెప్పారు. పవన్ కి పిచ్చి ఎక్కిందా? అని అన్నారు. ఏదో రకంగా చంద్రబాబుని సీఎం చేయాలన్నదే పవన్ ఆలోచన అని తెలిపారు.

మందు పోసి, బిర్యానీ ఇచ్చి చదువుకునేవాళ్లను పవన్ చెడగొడుతున్నారని కొట్టు సత్యనారాయణ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీన్ లోకి రాకుండా పవన్ తో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. జగనన్న సురక్ష పథకం ద్వారా ఆర్హులైన ప్రతిఒక్కరికీ అన్ని పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పుకొచ్చారు.

భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపునకు చూస్తోందని కొట్టు సత్యనారాయణ అన్నారు. పవన్, చంద్రబాబుకి మాత్రం పిచ్చి పట్టిందని చెప్పారు. 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞాని పవన్ కి చంద్రబాబు ఏం చేస్తున్నారో తెలియదా అని నిలదీశారు.

Pawan Kalyan: నాపై దెబ్బ పడినట్లే లెక్క.. ఇక శ్రీకాళహస్తి వస్తా అక్కడే తేల్చుకుంటా: పవన్ కల్యాణ్