Kurnool Man Climbs Tower : ఆదోనిలో టెన్షన్.. టెన్షన్.. భార్య కోసం భారీ టవర్ ఎక్కిన భర్త

Kurnool Man Climbs Tower : కర్నూలులో భార్య కోసం ఓ వ్యక్తి భారీ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు.

kurnool adoni man climbs tower for wife return to his house

Kurnool Man Climbs Tower : కర్నూలు జిల్లా, ఆదోనిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి భారీ టవర్ ఎక్కి.. స్థానికులను, పోలీసులను కంగారు పెట్టించాడు. తన భార్య వచ్చి చెబితేనే టవర్ మీద నుంచి దిగుతానని భీష్మించుకుర్చున్నాడు. ఆదోని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో సెల్ టవర్‌ ఎక్కి ఆందోళన చేస్తున్న యువకుడు.

చిప్పగిరి మండలం నేమకల్ గ్రామానికి చెందిన సురేంద్రకు ఆరు నెలల క్రితం నాగేశ్వరి అనే మహిళతో ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. పండుగకు పుట్టింటికి వెళ్లిన భార్య నెలరోజులు గడిచినా తిరిగి కాపురానికి రాలేదని మనస్తాపంతో సురేంద్ర టవర్ ఎక్కాడు. అతడు జిందల్ ఫ్యాక్టరీలో హెల్పర్ గా పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డ్రోన్ కెమెరా సాయంతో సురేంద్రకు నచ్చజెప్పి.. శాంతింపజేసి.. కిందకు దింపే ప్రయత్నం చేశారు.

ఫోన్ ద్వారా సురేంద్రతో మాట్లాడిన పోలీసులు వెంటనే దిగిరావాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అంగీకరించని సురేంద్ర.. తన భార్య వచ్చి దిగమని చెబితేనే కిందకు దిగుతానని.. అక్కడే ఉన్నాడు.

తనకు న్యాయం చేస్తామని చెప్పినా యువకుడు టవర్‌పైనే భీష్మించుకుని కూర్చున్నాడు. టవర్ దగ్గరకు భారీగా ప్రజలు తరలిరావడంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.