రాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి జల్లులు
- vamsi
- Published On : January 5, 2021 / 07:18 AM IST
Light showers in Andhra Pradesh:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు, ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తుండగా.. రాష్ట్రంలో దక్షిణకోస్తా, రాయలసీమలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్రలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కడప, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో చెదురుమదురుగా చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కోస్తాలో అనేకచోట్ల మంచు కురుస్తోంది.
రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోండగా.. విశాఖ ఏజెన్సీలోని మాడుగులలో 5.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
