Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు IMD తీవ్ర హెచ్చరిక.. అక్టోబర్ 13న తీవ్ర అల్పపీడనం.. ఇక కుండపోత వానలు!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న నూతన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Heavy Rain Alert) వెల్లడించింది.

low-pressure in Bay of Bengal to intensify into a cyclone heavy rains expected from October 15.

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల వాతావరణంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న నూతన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (Heavy Rain Alert) వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా, ఆపై తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 15వ తేదీ నుంచి పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.

Annadata Sukhibhava Funds: ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు దసరా కానుక.. అకౌంట్లలోకి రూ.6,000 జమ.. ఇవి పూర్తి చేస్తేనే డబ్బులు!

ప్రస్తుతం మండిపోతున్న ఎండలు.. సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం:

మరోవైపు తుఫాను రాకముందు రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. నిన్న అనేక ప్రాంతాల్లో భానుడు ప్రతాపం చూపి సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. అక్టోబర్ మాసంలో వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, తీవ్రమైన ఉక్కపోత తోడవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

15 నుంచి భారీ వర్షాల ముప్పు.. మత్స్యకారులకు హెచ్చరికలు:

బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న ఈ అల్పపీడన పరిణామాల వల్ల ఈ నెల 15 నాటికి తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల వేగం పెరగనుంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. రైతులు సైతం ముందస్తుగా తమ పంటలను రక్షించుకునే చర్యలు చేపట్టాలని, రానున్న రోజుల్లో తీరప్రాంత జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.