Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. అసలేం జరిగిందంటే?
Vizag Steel Plant : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో 8 మంది మృతిచెందారు.
- Sreehari A
- Updated on- June 8, 2026 / 07:21 PM IST
Vizag Steel Plant
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి
- ల్యాడిట్ నుంచి హాట్ మెంట్ బకెట్లు కూలిపడటంతో ప్రమాదం
- ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
- స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ఆరా తీసిన హోం మంత్రి అనిత
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని స్టీల్ మెల్ట్ షాప్ డిపార్ట్‌మెంట్‌లో ల్యాడిల్ నుంచి ఒక్కసారిగా హాట్‌మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో పెద్దమొత్తంలో ద్రవం పడటంతో 8 మంది కార్మికులు తీవ్ర గాయాలతో మృతి చెందారు. నలుగురు మృత దేహలను గుర్తించగా మరో నలుగురి మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే? :
విశాఖ స్టీల్ ప్లాంటులో ఎప్పటిలాగే అందులోని కార్మికులు హాట్ బకెట్లను తరలిస్తున్నారు. అయితే, ఒక్కసారిగా తరలించే హాట్మెంట్ బకెట్లు కుప్పకూలాయి. బకెట్లలోని భారీ మొత్తంలో వేడి ద్రవం ఒలికి అక్కడే పనిచేస్తున్న కార్మికులపై పడింది.
అదే సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. ల్యాడిల్ ద్రవం పడిన ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. కార్మికులు కూడా కొందరు మంటల్లో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదంలో గాయపడిన కార్మికులను చికిత్సి నిమిత్తం సమీపంలో ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు.. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంది. రెస్క్యూ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రమాదంపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి :
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై హోం మంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలను హోం మంత్రి అనిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం పర్యటనలో ఉన్న ఆమె హుటాహుటిన విశాఖకు బయలుదేరారు.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు హోం మంత్రి సంతాపం తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. ప్రమాద బాధితులకు వెంటనే వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు :
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో ఆయన మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు. వారిలో రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాస్, అర్జున అప్పారావు, సత్యనంద్, సూరిబాబు, పైడిరాజు ఉన్నారు.
