Markapuram Accident : మార్కాపురం ప్రమాదం.. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించిన AP ప్రభుత్వం

Markapuram Accident : మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఆ వివరాలు..

markapuram bus accident ap govt announces rs 5 lakh exgrartia to victims family

Markapuram Accident : మార్కాపురం జిల్లా, రాయవరంలో జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. 28 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో ప్రమాదంపై కేబినెట్ భేటీలో చర్చించారు. ప్రమాదంలో చనిపోయిన మృతులకు సంతాపం తెలిపిన కేబినెట్.. బాధిత కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేసింది. అలానే ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాలని మంత్రులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ఆర్ అండ్ బి, రవాణా శాఖ, పోలీసు, ఆరోగ్య శాఖలు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం, గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం ప్రధాని మోదీ ప్రకటించారు.