Mudragada Padmanabham : మాజీ మంత్రి ముద్రగడ ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స..!
Mudragada Padmanabham : ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.. పూర్తి వివరాలివే..
Mudragada Padmanabham
- ముద్రగడ పద్మనాభానికి తీవ్ర అస్వస్థత
- హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స
- వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న మాజీ మంత్రి
Mudragada Padmanabham : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.. ఇటీవల ముద్రగడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ను ఈ నెల 16 తేదీన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటినుంచి ముద్రగడ ప్రైవైట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ సంబంధ సమస్యతో ఆయన ఇబ్బంది (Mudragada Padmanabham) పడుతున్నారు. రెండు రోజులుగా ఆయనకు ఆస్పత్రి వైద్యులు డయాలసిస్ చేస్తూ వైద్యం అందిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి నుంచి కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం.
Read Also – Eleti Maheshwar Reddy : ఎందుకు భయపడుతున్నావ్? సీఎం రేవంత్ పై ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్
వయోభారం, కిడ్నీ సమస్యల కారణంగా ఆయన పూర్తిగా కోలుకునేందుకు కొన్నిరోజుల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కనీసం 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు.
ఇదిలా ఉండగా.. ముద్రగడ నెమ్మదిగా కోలుకుంటున్నారని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ముద్రగడ ఆరోగ్యం విషయంలో ఆందోళన అవసరం లేదని, ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇటీవలే కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ముద్రగడ చికిత్స తీసుకున్నారు. ఆయన మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
