Fire Accident : శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. 15 షాపులు దగ్ధం
మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
- bheemraj
- Published On : August 31, 2023 / 07:49 AM IST
Fire Accident In Srisailam
Fire Accident In Srisailam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని నంద్యాల(Nandyala) జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో(Srisailam) భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. 15 షాపులు దగ్ధం అయ్యాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ(Srisaila Mallikarjuna Swamy Temple) సమీపంలో ఉన్న లలితాంబికా దుకాణ సముదాయంలో(Lalitambika Shop Complex) గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
క్రమంగా మంటలు ఎల్ బ్లాక్ లోని మిగిలిన షాపులకు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 14 షాపులు దగ్ధం అయ్యాయి.
Fire Broke Out : శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్ లో చెలరేగిన మంటలు
మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
