Medico Priyanka : మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్.. కిమ్స్ వైద్యులు వెల్లడి!

Medico Priyanka : మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడుతూ మృతిచెందింది. ఆమె బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్టు కిమ్స్ వైద్యులు వెల్లడించారు.

Medico Priyanka

Medico Priyanka : రాజమండ్రి మెడికో ప్రియాంక మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు బ్రెయిన్ డెడ్ అయింది. ఇదే విషయాన్ని ఆస్పత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

రాజమండ్రిలో ఆగస్టు 3న రాత్రి ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టడంతో ప్రియాంక తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. అప్పటినుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.

ముందుగా రాజమండ్రిలో చికిత్స అందించగా, పరిస్థితి మెరుగుపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వైద్యులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

Read Also : Moto G06 Power Price : ఇది కదా డిస్కౌంట్.. ఈ మోటోరోలా G06 పవర్ ఫోన్ జస్ట్ రూ. 14వేలకే..

అయితే, పరిస్థితి విషమంగా మారడంతో బ్రెయిన్ డెత్ నిర్ధారణ కోసం అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు వైద్యులు ప్రయత్నించారు. కానీ ఆమె శరీరం అందుకు సహకరించలేదు. సోడియం లెవల్స్ భారీగా తగ్గడంతో టెస్ట్ నిర్వహణ సాధ్యం కాలేదని వైద్యులు తెలిపారు.

చివరకు ఆదివారం మధ్యాహ్నం ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ప్రియాంక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని కిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.