AP Rains : దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలోని ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు.. బలమైన ఈదురుగాలులు.. పిడుగులు పడే చాన్స్
AP Rains : ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రెండుమూడు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది.
- Harish Thanniru
- Updated on- May 12, 2026 / 07:06 AM IST
AP Rain
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48గంటల్లో బలపడే అవకాశం
- ఇవాళ ఏపీలోని 12 జిల్లాలకు వర్ష సూచన
AP Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. వేసవి ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు తమ పంటల ఉత్పత్తులను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read : Pawan Kalyan: కంచుకోటలో యంగ్ లీడర్లకు పగ్గాలు..! ఆ జిల్లాలపై పవన్ కల్యాణ్ స్పెషల్ కాన్సన్‌ట్రేషన్..
ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఉత్తర శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్టణం తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలప్పీడనానికి అనుబంధంగా 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అంచనా ప్రకారం.. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రెండుమూడు రోజులు ఏపీలో వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే చాన్స్ ఉందని తెలిపింది. ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
పిడుగుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, ఉరుములు శబ్దాలు వినిపించిన వెంటనే సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. వర్షాల సమయంలో, ఈదురుగాలుల సమయంలో పాత భవనాలు, భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల వద్ద, చెట్ల కింద ఉండొద్దని, రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో పనిచేస్తున్న సమయంలో ఉరుముల శబ్దాలు వినిపిస్తే వెంటనే సరక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
వర్షాలతోపాటు పలు ప్రాంతాల్లో ఇవాళ అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం విజయవాడ తూర్పులో అత్యధికంగా 42.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల ఎక్కువగా ఉంటుండటంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, ఒకవేళ బయటకు వెళ్లిన వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
