AP Rains : ఏపీ ప్రజలకు అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. భీకర ఈదురుగాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ..
AP Rains : ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చారు. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నేడు పలు జిల్లాల్లో భీకర ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- Harish Thanniru
- Published on- June 9, 2026 / 06:49 AM IST
Heavy Rains
AP Rains : ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చారు. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మంగళవారం పలు జిల్లాల్లో భీకర ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో ఇవాళ (మంగళవారం) అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, మార్కాపురం
జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాలకుతోడు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో నిలబడొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించారు.
పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖ సహా పలు కోస్తా జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
