AP Rains: బంగాళాఖాతంలో భారీ వాయుగుండం.. ఏపీకి మళ్లీ తుఫాను ముప్పు? వాతావరణ శాఖ హెచ్చరికలు!
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా సమాచారం ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రంపై శక్తివంతమైన ఉపరితల ఆవర్తనం(AP Rains) ఏర్పడే అవకాశం ఉంది.
- V Santhosh Kumar
- Published on- October 2, 2026 / 08:39 PM IST
Meteorological Department issues another cyclone warning for AP
AP Rains: బంగాళాఖాతంలో మళ్లీ వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 12 నాటికి ఉత్తర అండమాన్ సముద్రంపై ఒక శక్తివంతమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం రూపుదిద్దుకోనుండగా, అక్టోబర్ 15 నాటికి ఇది మరింత బలపడి దక్షిణ, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడన ప్రయాణ దిశ, తీవ్రతపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుందని తెలిపారు.
Interest Rates Update: మారిన వడ్డీ రేట్లు.. అధికారిక ప్రకటన చేసిన కేంద్రం.. వారికి మాత్రం బంపర్ ఆఫర్
అల్లూరి, పోలవరంలో వర్షాల హెచ్చరిక.. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు:
వాయుగుండం ముప్పు ఒకవైపు ఉండగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల శనివారం రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు(AP Rains) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా కోస్తా జిల్లాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా పిడుగులు పడే అవకాశముండటంతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి.. ప్రభుత్వం కీలక సూచనలు:
పిడుగులు పడే అవకాశం ఉన్నందున చేలలో పనిచేసే రైతులు, కూలీలు, చెట్ల కింద ఆశ్రయం పొందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరించింది. వాతావరణంలో వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంత ప్రజలు విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.
