AP Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. పిడుగులతోపాటు భీకర గాలులు

AP Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Andhra pradesh weather updates

  • ఏపీకి రెయిన్ అలెర్ట్..
  • పిడుగులతోపాటు భీకరగాలులతో కూడిన వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

AP Rain Alert : ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి రుతుపవనాలకుతోడు ఏపీ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని, ఈ నేఫథ్యంలో ఆదివారం ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులతోపాటు భీకర గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Hyderabad To Chennai High Speed Rail : అమరావతి మీదుగానే హైదరాబాద్‌- చెన్నై హైస్పీడ్‌ రైల్‌‌.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లోనే స్టేషన్లు..

రాగల మూడు గంటలు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపూరం, దివిసీమ, గుడివాడ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది.

అదేవిధంగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద ఉండొద్దని, హోర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.