Minister Atchannaidu: రొయ్యలకు రోగం… తినేవాళ్లు, రైతులు బీ కేర్ ఫుల్.. రంగంలోకి ఏపీ ప్రభుత్వం

రొయ్యలకు సోకుతున్న 'వైట్ గట్' వ్యాధి లక్షణాలపై ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) స్పందించారు.

Minister Atchannaidu responds to measure for preventing White Gut disease in shrimp.

  • వైట్ గట్ వ్యాధిపై స్పందన
  • క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన
  • ఆక్వా రైతులకు పూర్తి భరోసా

Minister Atchannaidu: రాష్ట్రంలో రొయ్యలకు సోకుతున్న ‘వైట్ గట్’ (White Gut) వ్యాధి లక్షణాలపై ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తక్షణమే స్పందించారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యశాఖ అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని, వ్యాధి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని సంబంధిత సంస్థలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Supreme Court: వివాహేతర సంబంధాలు.. ‘ప్రాధమిక హక్కుల’పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

మంత్రి ఆదేశాలతో మత్స్యశాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి, ఉండి మండలం మహదేవిపట్నంలోని వ్యాధి ప్రభావిత రొయ్యల చెరువును పరిశీలించారు. అక్కడ రైతు పి. మనోజ్ వర్మకు చెందిన చెరువు నుంచి నీరు, రొయ్యలు, మేత (ఫీడ్), ఫీకల్ నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను తదుపరి పరీక్షల కోసం కైకలూరు ల్యాబ్‌కు, నీటి నాణ్యత పరీక్షల కోసం భీమవరం ల్యాబ్‌కు అధికారులు పంపించారు.

ఈ వ్యాధి నియంత్రణ కోసం MPEDA, CIBA, NBFGR, NASPAD, ఫిషరీస్ యూనివర్సిటీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తాజా ఎస్‌ఓపీ (SOP) ప్రకారం రొయ్యల రైతులకు వ్యాధి నివారణపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. రొయ్యల రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.