×
Ad

Gudivada Amarnath : మీకు పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ అశ్లీలత పెరుగుతోంది : హరిరామజోగయ్యకు మంత్రి గుడివాడ బహిరంగ లేఖ

"మీ దిగజారుడుతనం పగవాడికి కూడా రాకూడదన్నారు.. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి" అని ప్రశ్నించారు.

  • Published On : July 4, 2023 / 07:33 PM IST

Gudivada letter Harirama Jogaiah

Gudivada Letter Harirama Jogaiah : హరిరామజోగయ్యకు ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ బహిరంగ లేఖ రాశారు. హరిరామజోగయ్యకు లేఖ రాస్తున్నందుకు బాధగానే ఉందన్నారు. “మీరు ఏ స్థాయికి దిగజారిపోయారో సమాధానం చెప్పడానికి లేఖ రాయడం తప్పడం లేదు” అని అన్నారు. “ఏ మనిషికైనా వయసు పెరిగేకొద్దీ సంస్కారం పెరుగుతుందని అంటారు… మీకు మాత్రం పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ అశ్లీలత పెరుగుతోంది” అని పేర్కొన్నారు.

కాబట్టే, ఇలాంటి చెత్త ఉత్తరాలను జనం మీదకు వదిలి హరిరామజోగయ్య కూడా స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీ పడాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సెన్సేషన్ కావటం కోసం అడ్డమైన వాగుడు వాగి, టీవీలకు, పత్రికలకు, సోషల్ మీడియాకు అందులో కూడా ప్రత్యేకించి ఎల్లో మీడియాకు మేత అందించాలనుకుంటున్నారని హరిరామజోగయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Dhulipalla Narendra : ఏ కేసుల మాఫీ కోసం జగన్ ఏపీకి అమూల్ ని తీసుకువచ్చారు : ధూళిపాళ్ల

“మీ దిగజారుడుతనం పగవాడికి కూడా రాకూడదన్నారు.. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి” అని ప్రశ్నించారు. పవన్ పుట్టిందే బాబు కోసం.. పవన్ పెరుగుతున్నదే ఎల్లో మీడియాలోనని పేర్కొన్నారు. పవన్ కు నిర్మాతలంతా బాబు మనుషులేనని ఆరోపించారు. హరిరామజోగయ్య కూడా మరో ప్యాకేజి స్టార్ కావడానికి వీలుగా బాబుని, బాబు మీడియాని, బాబు వర్గాన్ని సంతోషపరచడానికి ఈ చీప్ టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారని భావించాలా అని అన్నారు.

“ఎంతో గొప్ప రాజకీయ జీవితాన్ని అనుభవించిన మీ పట్ల వ్యక్తిగతంగా తమకు ఏ రకమైన శతృత్వంగానీ, వ్యతిరేకతగానీ లేదన్నారు.. కానీ, మీ రాతలు, మీ భావాలు, మీ దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయని, మీ పద్ధతి బాగుందో, లేదో, కనీసం మీ పిల్లల్ని, మీ శ్రేయోభిలాషులను కనుక్కుని మీరు విచక్షణతో, విజ్ఞతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని పేర్కొన్నారు.