Mekapati Goutham Reddy: నెల్లూరులోనే మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి 49ఏళ్ల వయసులో గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు.
- vamsi
- Published On : February 21, 2022 / 11:44 AM IST
Goutham Reddy
Mekapati Goutham Reddy: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 2014, 2019లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గౌతమ్ రెడ్డి.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు.
రాజకీయాలలో ప్రత్యేక శైలి, విలక్షణ పంథాతో కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా మంచిపేరు తెచ్చుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలు, నేతలు గౌతమ్ రెడ్డికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లాట్ నంబర్ 963, రోడ్డు నంబర్ 48, జూబ్లీహిల్స్, చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనున్న గౌతమ్ రెడ్డి భౌతికకాయం కాసేపట్లో చేరుకోనుంది. సాయంత్రం వరకూ ప్రజలు, అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో ఉంచనున్నారు కుటుంబసభ్యులు.. రేపు(22 ఫిబ్రవరి 2022) శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మంత్రి నివాసానికి భౌతికకాయం తరలిస్తారు.
అమెరికాలో ఉన్న మంత్రి కుమారుడు రేపటికి ఇండియా రానున్నారని, బుధవారం నెల్లూరులోనే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా కుటుంబ సభ్యుల సన్నిహితులు చెబుతున్నారు.
