Visakhapatnam Steel Plant: విశాఖ బాధితులకు అండగా ప్రభుత్వం.. రాత్రికే అకౌంట్లలో రూ. 25 లక్షలు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant)లో చోటుచేసుకున్న ప్రమాద బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారీ భరోసా కల్పించారు.
- V Santhosh Kumar
- Published on- June 9, 2026 / 06:10 PM IST
Minister Nara Lokesh announces massive compensation for vizag steel plant victims
- విశాఖ బాధితులకు భారీ ఆర్థిక సాయం
- కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగ హామీ
- పిల్లల చదువు, క్వార్టర్స్ ఉచిత సదుపాయం
Visakhapatnam Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ప్రమాద బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి నారా లోకేష్ భారీ భరోసా కల్పించారు. అమరావతి వేదికగా ఆయన బాధిత కుటుంబాల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన హామీలను ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని, తక్షణ సాయంతో పాటు వారి భవిష్యత్తుకు పూర్తి గ్యారెంటీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
Peace Dog Aloka: 3,700కి.మీ.లు పీస్ వాక్.. అమెరికానే షేక్ చేసిన మన ‘అలోకా’.. ఢిల్లీలో ఘనస్వాగతం
ఈ ప్యాకేజీలో భాగంగా ప్రమాదంలో మరణించిన శాశ్వత (పర్మినెంట్) ఉద్యోగుల కుటుంబాలకు మొత్తంగా రూ. 2 కోట్ల ఆర్థిక సాయాన్ని మంత్రి ప్రకటించారు. దీంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం, పిల్లల చదువుకు అవసరమైన పూర్తి సాయం అందిస్తూనే, స్టీల్ ప్లాంట్ పరిధిలోనే క్వార్టర్స్ సదుపాయాన్ని(Visakhapatnam Steel Plant) కొనసాగించేలా హామీ ఇచ్చారు. అలాగే, ప్రమాద తీవ్రత దృష్ట్యా కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా దాదాపు సమానమైన భరోసా కల్పించారు.
మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తంగా రూ. కోటి ఆర్థిక సాయం అందించనున్నారు. వీరికి సైతం కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం, పిల్లల చదువుకు సాయం, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. అంతేకాకుండా, తక్షణ ఉపశమనం కింద ఈ రోజు రాత్రికే బాధితుల ఖాతాల్లో రూ. 25 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
