Nara lokesh : మహానాడు వేదికగా మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన..

Nara lokesh : మహానాడు కార్యక్రమంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. మహిళా నాయకులకు శుభవార్త చెప్పారు.

Nara lokesh

Nara lokesh : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండ్రోజుల మహానాడు పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ మహానాడు కార్యక్రమంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. మహిళా నాయకులకు శుభవార్త చెప్పారు.

Also Read : Gold Rate Today : మహిళలకు గుడ్‌న్యూస్.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

నిజానికి, నారా లోకేశ్ ఇవాళ ఉదయమే తన సోషల్ మీడియా ఖాతాలో.. నేడు ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాను అంటూ ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సస్పెన్ష్ రేకెత్తించారు. దానికి అనుగుణంగా.. టీడీపీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామంటూ మహానాడు వేదికగా నారా లోకేశ్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాసైనా.. అవ్వకపోయినా పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని అన్నారు. తెలుగుదేశం సిద్ధాంతాలే మన బలం. రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అదీ సీబీఎన్ కృషి వల్లేనని లోకేశ్ పేర్కొన్నారు.

వైసీపీపై లోకేశ్ విమర్శలు గుప్పించారు. మాది గూగుల్‌.. మీది గొడ్డలి. మాది ఫైటర్‌ జెట్‌.. మీది ఫ్యాక్షన్‌. మాది కియా అయితే.. మీది కిడ్నాప్‌ అని లోకేశ్‌ విమర్శించారు.