ఇంకా ఏమి కావాలి? షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా
చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని మంత్రి రోజా అన్నారు.
- Harishth Thanniru
- Published On : February 23, 2024 / 12:11 PM IST
Minister Roja
Minister Roja : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర సంవత్సరాలు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డననని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని చెప్పిన షర్మిల.. నేడు ఏపీకి వచ్చి జగన్ మోహన్ రెడ్డిపై విషం చిమ్మేందుకు ఆరాటాలు పోరాటాలు చేస్తుందని రోజా విమర్శించారు. మంత్రి రోజా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ షర్మిల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : దళిత జాతి అభ్యున్నతకు కృషిచేస్తా : వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు
చంద్రబాబు నాయుడు హయాంలో ఇవ్వాల్సిన డీఎస్సీలు 1998, 2008, 2018కు సంబంధించి 17వేల పోస్టులను వైయస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారని అన్నారు. మళ్లీ ఇప్పుడు 6,100 పోస్టులతో డీఎస్సీ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. కానీ, షర్మిల వ్యాఖ్యలను బట్టిచూస్తే కనీస రాజకీయ అవగాహన ఆమెకు లేదని అర్థమవుతుందని రోజా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని షర్మిలకు హితవుపలికారు.
Also Read : మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు.. ఇనుప కంచెలు వేసి బందీ చేశారు: షర్మిల
చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని రోజా అన్నారు. రాజశేఖర్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి, షర్మిలకు పేరుతోపాటు ఆస్తులను పంచి ఇచ్చారని, ఇంకా ఆమెకు ఏం కావాలని రోజా ప్రశ్నించారు.
