దళిత జాతి అభ్యున్నతికి కృషిచేస్తా : వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ పథకాలు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు అన్నారు.

దళిత జాతి అభ్యున్నతికి కృషిచేస్తా : వైసీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు

Rajya Sabha member Golla Baburao

Golla Baburao : దళిత జాతి అభ్యున్నతికు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన తరువాత తొలిసారి విశాఖ విమానాశ్రయానికి గొల్ల బాబూరావు చేరుకున్నారు. ఆయనకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దళిత జాతి అభ్యున్నతకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Also Read : Kimidi Nagarjuna : చీపురుపల్లిలో మొదలైన అసమ్మతి.. గంటా వ్యాఖ్యలతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపం!

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. పాకరాయపేట నియోజకవర్గానికి, రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకొచ్చేలా నా వంతు కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రాజ్యసభలో నా గొంతు వినిపించి, నిధులు ఎక్కువ తెస్తానని అన్నారు. కంబాల జోగులు సీనియర్ ఎమ్మెల్యే అని, ఆయన విజయానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు. దళితులపై జరిగిన దాడులపై సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి వారిపై కేసులు నమోదు చేశారని, వీటిపై ప్రతిపక్షాలు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

Also Read : లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుపై నారాయణ కీలక వ్యాఖ్యలు

రాజ్యసభలో ఖాళీ అయిన మూడు స్థానాలకు వైసీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపిక  చేసిన విషయం తెలిసిందే. వీరు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి నుంచి వారు ధృవపత్రాలను అందుకున్నారు.