Kimidi Nagarjuna : చీపురుపల్లిలో మొదలైన అసమ్మతి.. గంటా వ్యాఖ్యలతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపం!

Kimidi Nagarjuna : మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు వ్యాఖ్యలతో చీపురుపల్లిలో అసమ్మతి మొదలైంది. పార్టీ అధిష్టానం తనను ఇక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పిందని వ్యాఖ్యానించడంతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపం చెందారు.

Kimidi Nagarjuna : చీపురుపల్లిలో మొదలైన అసమ్మతి.. గంటా వ్యాఖ్యలతో కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపం!

Clashes In TDP Cheepurupalli Seat

Kimidi Nagarjuna : చీపురుపల్లి టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలో సీట్ల వ్యవహారంతో నేతల్లో అసమ్మతి రాగం వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ పార్టీ అధిష్టానం నిర్ణయంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో చీపురుపల్లిలో అసమ్మతి సెగ మొదలైంది.

Read Also : Telangana Government : ఆరోజు నుంచే ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్..

ఇప్పటివరకూ విశాఖ పరిధిలోనే పోటీ చేసిన తనను ఇకపై చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని ఆయన చెప్పారు. గంట వ్యాఖ్యలతో చీపురుపల్లి ఇంచార్జిగా ఉన్న కిమిడి నాగార్జున తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ పెద్దల ఫోన్లకు కూడా నాగార్జున అందుబాటులో రావడం లేదు.

ఈ క్రమంలోనే టీడీపీ నేతలు నాగార్జున ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మనస్తాపం చెందిన నాగార్జునను కలిసి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కిమిడి నాగార్జున.. పార్టీ కార్యక్రమాలు జిల్లా ప్రధాన కార్యదర్శితో సంప్రదించాలని కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో చీపురుపల్లి టీడీపీలో గందరగోళానికి దారితీసింది. చీపురుపల్లిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశారని, వచ్చే ఎన్నికల్లో కిమిడి నాగార్జునకే సీటు ఇవ్వాలని స్థానిక టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు.

విశాఖ నుంచే పోటీ చేయాలని ఉంది : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
అంతకుముందు.. చీపురుపల్లి నుంచి పోటీ చేయడంపై గంటా శ్రీనివాసరావు తన నిర్ణయాన్ని వెల్లడించారు. తాను ఇక్కడి నుంచే పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరిందన్నారు. చీపురుపల్లి పక్క జిల్లాలో ఉందన్న ఆయన దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా? లేదా అనేది పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో చర్చించి తన నిర్ణయాన్ని హైకమాండ్‌కు తెలియజేస్తానన్నారు.

వాస్తవానికి తాను గతంలో గెలిచిన నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని ఉందని మాజీ మంత్రి గంటా స్పష్టం చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయడంపై తాను ఒక నిర్ణయానికి రాలేదన్నారు. త్వరలో టీడీపీ జాబితా రానున్న నేపథ్యంలో విశాఖ నుంచే తనకు పోటీ చేయాలని ఉందని తన మనస్సులోని మాటను వెలిబుచ్చారు. విశాఖ నుంచి నన్ను పంపేద్దామని భావిస్తున్నారా? ఏంటి? ఏది ఏమైనా నా నిర్ణయాన్ని పార్టీ నేతలకు చెబుతునాని గంటా శ్రీనివాసరావు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Read Also : విశాఖ టీడీపీలో సీట్ల చిచ్చు.. గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు