విశాఖ టీడీపీలో సీట్ల చిచ్చు.. గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

పార్టీ నాయకులకు నా అభిప్రాయం చెబుతాను. వారం రోజుల్లో టీడీపీ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది.

విశాఖ టీడీపీలో సీట్ల చిచ్చు.. గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao : వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయడంపై ఆలోచిస్తున్నానని చెప్పారు మాజీమంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. పార్టీ అధిష్టానం అక్కడి నుంచి పోటీ చేయాలని తనకు సూచించిందన్నారు. ఇప్పటివరకు తాను విశాఖ పరిధిలోనే పోటీ చేశానని ఆయన తెలిపారు. చీపురుపల్లి పక్క జిల్లాలో ఉందని, దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నారు. అక్కడ పోటీ తనకు సరిపోతుందా? లేదా? అన్న విషయాన్ని కార్యకర్తలు, అభిమానులతో చర్చించి హైకమాండ్ కు తన నిర్ణయాన్ని చెబుతానన్నారు గంటా శ్రీనివాసరావు.

”గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను ఆలోచన చేశాను. చీపురుపల్లిలో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చీపురుపల్లి నాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచనలో పడ్డాను. వారం రోజుల్లో టీడీపీ లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది. నాకు విశాఖ నుండి పోటీ చేయాలని ఉంది. నన్ను ఈ జిల్లా నుంచి పంపేద్దాం అనుకుంటున్నారా? పార్టీ నాయకులకు నా అభిప్రాయం చెబుతాను” అని గంటా శ్రీనివాసరావు అన్నారు.

Also Read : సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది