Cm Chandrababu Naidu: సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి(Cm Chandrababu Naidu)ని ఆయన అధికారిక నివాసంలో అదృశ్యమైన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు కలిశారు.
- V Santhosh Kumar
- Published on- June 19, 2026 / 03:41 PM IST
Missing Sai Krishna mother and family members met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu
- సాయి కృష్ణ ఫ్యామిలీని కలిసిన చంద్రబాబు
- సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు.
- ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కుటుంబాన్ని తీసుకువచ్చారు.
Cm Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన అధికారిక నివాసంలో అదృశ్యమైన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వారికి ధైర్యం చెప్పారు. సాయికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.
Delhi: క్షుద్రపూజల కలకలం.. పనిమనిషిని చంపిన డాక్టర్.. బ్యాట్ తో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా..
సాయికృష్ణ అదృశ్యమైన ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే నిర్లక్ష్యం వహించిన స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)ను సస్పెండ్ చేయటంతో పాటు, విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిదైనా తప్పు ఉందని తేలితే ఎంతటివారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని సీఎం వారికి స్పష్టం చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలనే ఉద్దేశంతో పెనుమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు (ఎమ్మెల్యే) బోడె ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆయనే స్వయంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని, ఆమె కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకువచ్చి, వారి సమస్యను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి, త్వరలోనే న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ పట్ల బాధిత కుటుంబ సభ్యులు తమ నమ్మకాన్ని, కృతజ్ఞతలను తెలియజేశారు.
