Modi and Chandrababu meets after long time
Modi and Chandrababu meet: ప్రధానమంత్రి నేరేంద్ర మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్నారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్లో ఆజదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశం అనంతరం ఈ కలయి జరిగింది. సమావేశం అనంతరం మోదీయే చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించారు. అనంతరం ఇద్దరూ కాస్త పక్కకు వెళ్లి సుమారు 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే చంద్రబాబుతో మోదీ ప్రత్యేకంగా చర్చించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో ఐదేళ్ల క్రితం బీజేపీతో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. మళ్లీ ఇన్నేళ్లకు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకోవడం విశేషం.
మోదీని కలిసిన అనంతరం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతల్ని చంద్రబాబు కలుసుకున్నారు. అనంతరం సినీ నటుడు రజనీకాంత్, పిటి ఉష సహా పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు. అనంతరం దేశ, రాష్ట్ర పరిణామాలపై మీడియా ప్రతినిధులతో చంద్రబాబు ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు వేచి చూస్తున్నారని తెలిపారు.
Jagdeep Dhankhar: నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్