Putta Mahesh Yadav: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్
మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దని రిక్వెస్ట్ చేశారు పుట్టా మహేశ్. ఎప్పుడూ కూడా తాను నిజాలే చెబుతానని వెల్లడించారు.
- Naveen
- Published On : March 16, 2026 / 01:10 AM IST
- నేను ఎలాంటి తప్పు చేయలేదు
- వాళ్లు పిలవడంతోనే డిన్నర్ కి వెళ్లా
- ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను
- సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దు
Putta Mahesh Yadav: మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ స్పందించారు. దీనికి సంబంధించిన ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అందులో తెలిపారు. ఎన్నో రోజుల నుంచి తనను కలవాలని కొందరు పిలవడంతోనే ఆ డిన్నర్‌కు వెళ్లినట్లు వివరించారు. ఆ డిన్నర్ లో తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఏలూరు ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దని రిక్వెస్ట్ చేశారు పుట్టా మహేశ్. ఎప్పుడూ కూడా తాను నిజాలే చెబుతానని వెల్లడించారు.
కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ లభించింది. పుట్టాతో పాటు ప్రియాంక రెడ్డికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో పుట్టా మహేశ్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారు పోలీసులు.
మరోవైపు డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సీరియస్ అయ్యారు. పుట్టా మహేశ్ నుంచి వివరణ తీసుకోవాలన్నారు. చంద్రబాబు ఆదేశాలతో పుట్టా మహేశ్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది టీడీపీ. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై 48 గంటల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరణ ఇచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేశ్ ను ఆదేశించారు.
Also Read: డ్రగ్స్ పార్టీ కేసు.. మాజీ ఎమ్మెల్యేకి షాక్.. 14 రోజుల రిమాండ్
