Mudragada Padmanabham : మీ బెదిరింపులకు భయపడి నేను లొంగిపోను.. పవన్ కళ్యాణ్ కు మరో లేఖ రాసిన ముద్రగడ

ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం పవన్ కు ఉన్నాయని భావిస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్, జనసైనికులు తనను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషమన్నారు.

Mudragada - Pawan

Mudragada Letter Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ రాశారు. కాకినాడ నుండి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవాలన్నారు. “ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుని నన్ను మీ మీద పోటీ చేయడానికి నాకు సవాలు విసరండి” అని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ చేగువేరా ఆదర్శం అంటారు.. గుండెలు నిండా ధైర్యం ఉందని చెప్తారని తెలిపారు. ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం పవన్ కు ఉన్నాయని భావిస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్, జనసైనికులు తనను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషమన్నారు.

Tirumala : శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై శ్వేతపత్రం విడుదల.. రూ. 861 కోట్ల విరాళాలు

“మీ బెదిరింపులకు భయపడి నేను లొంగుబాటుకు రాను” అని ముద్రగడ స్పష్టం చేశారు. తాను పవన్ కళ్యాణ్ బానిసను కాదని.. ఆయన మోచేతి కింద నీళ్లు తాగడం లేదన్నారు. “గోచి మొలత్రాడు లేని వారితో తనను తిట్టిస్తున్నారు.. దమ్ముంటే మీరు నన్ను తిట్టండి” అని సవాల్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు