Nallapureddy Prasanna Kumar Reddy : నేను అవినీతి చేశానని నిరూపిస్తే బుచ్చి బస్టాండ్ లో ఉరేసుకుంటా : ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
నల్లపురెడ్డి శ్రీనివావసులు రెడ్డిపై కుట్రలు చేసి.. చంద్రబాబు పార్టీ నుంచి బయటికి పంపించాడని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు.
- bheemraj
- Published On : July 7, 2023 / 01:41 PM IST
Nallapureddy Prasanna Kumar Reddy
Nallapureddy Anger Lokesh : టీడీపీ నాయకుడు నారా లోకేష్ పై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తనపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. లోకేష్ ఆరోపణలపై సీఎం వైఎస్ జగన్ ను కలిసి సీబీఐ ఎంక్వైరీ కోరుతానని చెప్పారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. తాను అవినీతి చేశానని నిరూపిస్తే బుచ్చి బస్టాండ్ లో ఉరేసుకుంటానని పేర్కొన్నారు.
తన దగ్గర రూ.1,500 కోట్లు ఉంటే.. జిల్లాలో టీడీపీనే లేకుండా చేస్తానని చెప్పారు. రూ.1,500 కోట్లలో వన్ పర్సెంట్ తనకు ఇస్తే.. తన నియోజకవర్గంలో ఉన్న అనాధ పిల్లలకు పంచేస్తానని తెలిపారు. తమ కుటుంబానికి వేల ఏకరాలు ఉంటే నిరుపేదలకు పంచి పెట్టామని వెల్లడించారు. నల్లపురెడ్డి కుటుంబ చరిత్ర ఏంటో.. చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు.
Pawan kalyan : మంత్రి కొట్టు సత్యనారాయణ ఇలాఖాలో పవన్ కల్యాణ్ .. నేతలతో చర్చలు
నల్లపురెడ్డి శ్రీనివావసులు రెడ్డిపై కుట్రలు చేసి.. చంద్రబాబు పార్టీ నుంచి బయటికి పంపించాడని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే కోవూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. “మందు తాగి స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో డాన్సులు వేసింది నేనా..? లోకేష్ హా..? నీ పక్కన ఉన్న చెంచా గాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే నా మీద ఆరోపణలు చేస్తావా” అంటూ మండిపడ్డారు.
పిల్ల బచ్చా లోకేష్. తన చిటికిన వేలుతో సమానం అన్నారు. “మీ తాత రెండెకరాలు ఇస్తే.. మీ నాన్న వేల కోట్లు ఎలా సంపాదించాడు” అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కళా వెంకట్రావు, బీదా రవిచంద్ర, బుచ్చయ్య, వెంకటేశ్వర్లు రెడ్డిని తమ ఇంటికి పంపిస్తే తమ కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులు చూపిస్తానని.. అవినీతి చేశాను అంటే.. ఉరేసుకుంటా అని స్పష్టం చేశారు.
