Nara Bhuvaneshwari : ఏపీ వ్యాప్తంగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర?

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రారంభమై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నారా భువనేశ్వరి బస్సు యాత్ర సాగనుందని తెలుస్తోంది.

Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari – Bus Yatra : టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండటం, లోకేష్ ఢిల్లీకే పరిమితం కావడంతో టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రంగంలోకి దిగబోతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారా? అంటే టీడీపీ శ్రేణులు మాత్రం అవునని అంటున్నారు. ఈ బస్సు యాత్రకు మేలుకో ఆంధ్రుడా అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ యాత్ర పది రోజులపాటు జరిపేలా ప్లాన్ చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ పిటిషన్ పైన నిర్ణయాన్ని బట్టి ఈనెల (అక్టోబర్) మొదటి వారంలో బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రారంభమై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నారా భువనేశ్వరి బస్సు యాత్ర సాగనుందని తెలుస్తోంది.

Pawan Kalyan : నేటి నుంచి పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర.. తొలిసారి కలిసి పాల్గొననున్న జనసేన, టీడీపీ

చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు బహిరంగంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని భువనేశ్వరి ఈ యాత్రతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. రేపు (సోమవారం) గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా భువనేశ్వరి దీక్ష చేపట్టనున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. భువనేశ్వరితోపాటు ఆమె కోడలు బ్రాహ్మణి కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్లొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు