Nara Lokesh : నారా భువనేశ్వరి బస్సుయాత్ర ప్రారంభం.. లోకేశ్ భావోద్వేగ ట్వీట్
నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగ ట్వీట్ చేశారు.
- Harish Thanniru
- Updated on- October 25, 2023 / 11:05 AM IST
Nara Lokesh
Nara Bhuvaneshwari Bus yatra : చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ‘నిజం గెలవాలి’ పేరిట నారా భవనేశ్వరి బస్సుయాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్ర బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభంకాగా.. చంద్రబాబు అరెస్టుతో ఆవేదనతో మృతిచెందిన కె. చిన్నస్వామినాయుడు, ఎ. ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను భువనేశ్వరి తొలిరోజు పరామర్శిస్తారు. పరామర్శ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. సాయంత్రం అగరాల గ్రామంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ బస్సు యాత్రలో భాగంగా మృతుల కుటుంబాలను పరామర్శించడంతో పాటు పలు సభలు, సమావేశాల్లో ఆమె పాల్గొని ప్రసంగిస్తారు.
నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ఆమె కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మా.. తప్పక నిజం గెలుస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి కలిసి వెళ్తున్న ఫొటోను లోకేశ్ షేర్ చేశారు.
అమ్మా… తప్పక నిజం గెలుస్తుంది.#NijamGelavali pic.twitter.com/1qoJj6fq6p
— Lokesh Nara (@naralokesh) October 25, 2023
