Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 3 వేల DSC పోస్టుల భర్తీ.. నారా లోకేష్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ ద్వారా మరో 3,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) వెల్లడించారు.
- V Santhosh Kumar
- Updated on- August 23, 2026 / 03:12 PM IST
Nara lokesh announces 3000 dsc teacher posts recruitment in andhra pradesh
- మరో 3,000 డీఎస్సీ పోస్టుల భర్తీ
- ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు కీలక ఆదేశాలు
- నిరుద్యోగుల్లో మళ్లీ చిగురించిన ఆశలు
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలోనే డీఎస్సీ (DSC) ద్వారా మరో 3,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) వెల్లడించారు. విజయనగరంలోని దాసన్నపేట పాఠశాలలో శనివారం నిర్వహించిన క్లస్టర్ పాఠశాలల సమావేశంలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఉపాధ్యాయులతో ప్రత్యక్ష ముఖాముఖి & టెట్ నిర్వహణ:
విద్యా వ్యవస్థలో ఆశించిన మార్పులను విద్య ద్వారానే సాధించవచ్చని విశ్వసిస్తున్నట్లు తెలిపిన మంత్రి, నాణ్యమైన బోధనా పద్ధతులను తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రాంతాలకు చెందిన టీచర్లతో ఆయన నేరుగా మాట్లాడారు. అలాగే ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ (TET) నిర్వహించే ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు:
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,034 సముదాయాల ఉపాధ్యాయులు లైవ్ ద్వారా పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఏపీ ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన లోకేశ్, త్వరలోనే పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు గడువులపై పూర్తి స్థాయి ప్రకటన విడుదల చేయనున్నారు.
