Counting: నెల్లూరు కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు.. మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.
- vamsi
- Updated on- November 17, 2021 / 05:14 PM IST
Muncipal Polls
Counting: నెల్లూరు కార్పొరేషన్ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు.. మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.
మొత్తం మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు ఓటింగ్ జరగగా.. మరికాసేపట్లో పోటీపడ్డ 1,206 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఉదయం 8గంటలకు కౌంటింట్ స్టార్ట్ అయ్యింది.
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, తర్వాత సాధారణ ఓట్లు లెక్కిస్తారు. సాయంత్రం 5గంటల్లోపు అన్నీ మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 23 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించడానికి 450 టేబుళ్లను ఏర్పాటుచేశారు అధికారులు. కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా 534 మందిని, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా 3,792 మందిని నియమించారు.
AP Municipal Results: ఏపీలో మున్సిపల్ ఫలితాలు నేడే
నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్‌లు ఉండగా 8 డివిజన్‌లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 46 డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లు ఏర్పాటుచేశారు.
కుప్పంలో 24 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. పద్నాలుగు టేబుళ్లు ఉన్నాయి. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పోలింగ్‌లో 8,62,066మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Kuppam: కుప్పం కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ప్రత్యేక అధికారిని నియమించిన హైకోర్టు
Kuppam Municipality: కాక పుట్టిస్తున్న కుప్పం.. గెలుపెవరిది..?
