Kuppam: కుప్పం కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ప్రత్యేక అధికారిని నియమించిన హైకోర్టు

కుప్పం మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది.

Kuppam: కుప్పం కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ప్రత్యేక అధికారిని నియమించిన హైకోర్టు

Kuppam Muncipal

Kuppam Municipality: కుప్పం మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది. మిగిలిన 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 87మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 76.49శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల ఓట్లు లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఓట్ల లెక్కింపు కుప్పంలోని MFC ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కాలేజీలో జరగనుంది. ఓట్లు లెక్కింపులో 67 మంది సిబ్బంది పాల్గొననున్నారు. లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా.. కౌంటింగ్ హాల్-1లో మొదటి రౌండ్.. 1,2,3,4,5,6,7, రెండో రౌండ్.. 16,17,18,19,20,21,22 లెక్కింపు జరగనుంది.

హాల్-2లో మొదటి రౌండ్‌ 8,9,10,11,12,13,15, రెండవ రౌండులో 23,24,25 వార్డులకు రెండు రౌండ్లు లో ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. కుప్పం మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ముఖ్య నేతలు. ఈ క్రమంలోనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు టీడీపీ నేతలు.

పిటీషన్‌ని పరిశీలించిన కోర్టు.. కౌంటింగ్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించింది. ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డిని నియమించగా.. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేయాలని ఎస్‌ఈసీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ వీడియో రికార్డింగ్‌ను న్యాయస్థానానికి సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.